: ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు వీరే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. సుంకర పద్మశ్రీని ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించగా, నేరెళ్ల శారదను తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించింది. వీరితోపాటు మరో ఏడు రాష్ట్రాలకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులను ఏఐసీసీ నియమించింది. దీంతో ఇంతవరకు మహిళా అధ్యక్షులు లేకుండా నడిచిన ఏపీ, తెలంగాణ పీసీసీలు మరింత బలం పుంజుకుంటాయని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. కాగా, త్వరలోనే తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ పదవుల భర్తీ జరిగినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.