: ఒకరికి గెలుపు ఆరాటం...మరొకరిది విజయ పోరాటం

ఐపీఎల్ లో నేడు కీలక సమరానికి తెరలేవనుంది. ఐపీఎల్ సీజన్-8 లో ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు, ప్లేఆఫ్ లో చేరేందుకు రెండు విజయాలు అవసరమైన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించడం వల్ల పాయింట్ల పట్టికలో అదనంగా రెండు పాయింట్లు జమ చేరడమే కాకుండా, సన్ రైజర్స్ హైదరాబాదు ప్లేఆఫ్ అవకాశాలు కూడా అడుగంటుతాయి. సన్ రైజర్స్ మాత్రం విజయమే లక్ష్యంగా బరిలో దిగనుంది. గత రెండు మ్యాచుల్లోనూ చివరి ఓవర్లలో అదృష్టం కలిసివచ్చి గెలిచిన హైదరాబాదు జట్టు, ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ప్లేఆఫ్ లో స్థానం సంపాదించుకుంటుంది. లేని పక్షంలో ఇంటి ముఖం పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో పరాజయాలతో డీలా పడిన పంజాబ్ జట్టు గెలుపుకోసం ఆరాటపడుతుండగా, విజయమే లక్ష్యంగా పోరాడేందుకు సన్ రైజర్స్ బరిలోకి దిగుతోంది. ఇంకాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్ లో విజయం సాధించేందుకు టాస్ కీలకం కానుంది.

More Telugu News