: విజయవాడ మ్యూజియంకు దర్శకుడు బాపు పేరు

విజయవాడలో ప్రభుత్వ మ్యూజియంకు ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు పేరు పెట్టారు. దర్శకుడిగా, చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన బాపు పేరును మ్యూజియంకు పెట్టడం ఆయనకు ఘన నివాళి ప్రకటించడమేనని బాపు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది తీవ్ర అనారోగ్యంతో బాపు తుదిశ్వాస విడిచారు. తెలుగువారైన బాపుకు సగౌరవం ఇవ్వాలన్న ఆలోచనతో ఏపీ ప్రభుత్వం మ్యూజియంకు ఆయన పేరును పెట్టింది. ఈ విషయంపై ప్రభుత్వ వైపు నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Telugu News