: జయతో పాటు వారు కూడా నిర్దోషులే!

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జయ అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఇటీవలే జయను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు తీర్పును కొట్టివేయడమే కాకుండా... ఆమెపై మోపిన అన్ని అభియోగాలను కొట్టి వేసింది. 'అమ్మ'ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ క్రమంలో, ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గుర్ని కూడా హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. జయ స్నేహితురాలు శశికళ, ఆమె కుమారుడు సుధాకరన్ లతో పాటు ఇళవరసిలకు కూడా హైకోర్టులో ఊరట లభించింది. వీరిని కూడా హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

More Telugu News