: పార్లమెంటులో మిఠాయిలు పంచిన అన్నాడీఎంకే ఎంపీలు
అదాయానికి మించిన ఆస్తుల కేసులో తమ అధినేత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో పార్టీ ఎంపీలు సంతోషంలో మునిగిపోయారు. వెంటనే పార్లమెంటులో తోటి ఎంపీలందరికీ మిఠాయిలు పంచారు. జైలు శిక్ష విధించినప్పటి నుంచి ఇంటికే పరిమితమైన జయ పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడంలేదు. ఈ క్రమంలో అక్రమాస్తుల కేసులో అమ్మకు ఊరట లభించాలని, మళ్లీ రాజకీయాల్లోకి రావాలని పార్టీ నేతలు, ఎంపీలు, అభిమానులు చేసిన ప్రార్థనలు సఫలమయ్యాయి.