: కోల్ కతా ఎయిర్ పోర్టులో పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ కు చేదు అనుభవం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యార్ ఖాన్ కు నిన్న కోల్ కతా ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. భారత్, పాక్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ల పునరుద్ధరణ, పాక్ లో భారత జట్టు పర్యటన తదితర అంశాలపై బీసీసీఐ చీఫ్ జగ్ మోహన్ దాల్మియాతో చర్చించేందుకు షహర్యార్ నిన్న కోల్ కతా వచ్చారు. అయితే పాక్ నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు నాలుగు చోట్ల మాత్రమే అనుమతి ఉంది. ఈ నిబంధన ప్రకారం ఢిల్లీ, ముంబై, చెన్నై, అమృత్ సర్ లలో మాత్రమే పాక్ నుంచి వచ్చేవారు దిగాల్సి ఉంది. అయితే షహర్యార్ నిన్న బంగ్లాదేశ్ మీదుగా నేరుగా కోల్ కతా చేరుకున్నారు. దీంతో ఎయిర్ పోర్టులో ఆయనను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. అంతేకాక స్వల్పకాలం పాటు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న కేంద్ర హోం శాఖ ఉన్నతాధికారుల జోక్యంతో షహర్యార్ పర్యటనను ‘ప్రత్యేక కేసు’గా పరిగణించి ఆయనను వదిలేశారు.

More Telugu News