: కేసీఆర్ జిల్లాలో కల్తీ కల్లు జోరు... 30 మందికి అస్వస్థత, గాంధీ ఆస్పత్రిలో చికిత్స
తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలోని జిన్నారం మండలం మాంబాపూర్ లో కల్తీ కల్లు తాగి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు స్థానికంగానే ప్రథమ చికిత్స చేసినా, ఫలితం లేకపోవడంతో స్థానికులు హుటాహుటీన హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ బాధితులు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది కల్తీ కల్లు విక్రయాలపై దృష్టి సారించారు.