: నీతూను నేను డబ్బులడిగింది వాటర్ బాటిళ్లకు మాత్రమే: నాగరాజు
సస్పెండైన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు తనపై దాడిచేసినట్టు నటి నీతూ అగర్వాల్ ఆరోపించడం తెలిసిందే. దీనిపై నిందితుడు నాగరాజు స్పందించాడు. నీతూ నంద్యాల సబ్ జైలులో ఉన్నప్పుడు ఆమెకు తాను వాటర్ బాటిళ్లు ఇచ్చానని, వాటికి డబ్బులు అడిగానని వివరణ ఇచ్చాడు. అంతే తప్ప, తాను ఆమెపై దాడి చేశాననడం అవాస్తవమని స్పష్టం చేశారు. బెయిల్ షరతుల ప్రకారం...ఆమె ప్రతి ఆదివారం రుద్రవరం పీఎస్ లో సంతకం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో సంతకం చేసి హైదరాబాద్ వెళుతుండగా, నాగరాజు తమ వాహనానికి కారును అడ్డంపెట్టి, దాడికి పాల్పడ్డాడంటూ నీతూ అగర్వాల్ సిరివెళ్ల పీఎస్ లో ఫిర్యాదు చేసింది.