: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఫుట్ బాల్ దిగ్గజం

బ్రెజిల్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ దిగ్గజం పీలే (74) ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధ పడుతున్న పీలేను ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల హాస్పిటల్ లో చేర్పించారు. ఈ క్రమంలో, ఆయనకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం పీలే ఆరోగ్య పరిస్థితి బాగుందని, అందుకే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. ఫుట్ బాల్ ప్రపంచ కప్ ను మూడు సార్లు గెలుచుకున్న ఆటగాడిగా పీలే రికార్డ్ క్రియేట్ చేశారు. తరచుగా అనారోగ్యానికి గురవుతున్న పీలేకు... ఇప్పటికే పలు శస్త్ర చికిత్సలు జరిగాయి.

More Telugu News