: జగన్ జైలుకెళ్లడం ఖాయం!: ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయమట. ఈ మేరకు నేడు కర్నూలులో పర్యటించిన సందర్భంగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పథకంపై మాట్లాడే హక్కు జగన్ కు లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. నాడు రుణమాఫీ సాధ్యం కాదని ప్రకటించిన జగన్, నేడు రుణమాఫీ సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే రైతుల రుణమాఫీని దాదాపుగా పూర్తి చేసిన తాము డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తున్నామని ప్రత్తిపాటి పేర్కొన్నారు.