: మావోయిస్టులను ఏరిపారేస్తాం... దంతెవాడలో ప్రధాని మోదీ ప్రకటన

దేశంలో మావోయిస్టులను ఏరిపారేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ, దంతెవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న మావోలను మూలాలు సహా ఏరిపారేస్తామని మోదీ అన్నారు. హింసకు భవిష్యత్తు లేదన్న మోదీ, శాంతికి మాత్రమే ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మావోయిస్టుల సమస్యతో సతమతమవుతున్న ఛత్తీస్ గఢ్ ప్రజలు ఎంతమాత్రం నిరాశ చెందాల్సిన పనిలేదని చెప్పిన ఆయన, మావోయిస్టులపై పోరు సాగిస్తామని ప్రకటించారు. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలు మురికివాడల్లో నివసించాలని కోరుకోరని, అందరికీ అభివృద్ధి ఫలాలను అందించాల్సిన గురుతర బాధ్యతలను తమ ప్రభుత్వం తీసుకుందని మోదీ ప్రకటించారు.

More Telugu News