: కేవలం నాలుగు కార్లలో ఒకటి కోహ్లీ సొంతం చేసుకున్నాడు
'ఆడి' కంపెనీ విడుదల చేసిన స్పెషల్ అడిషన్ కారును కోహ్లీ సొంతం చేసుకుని ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆడి కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కారు 'ఆర్8 ఎల్ఎంఎక్స్'ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ కారు ధరను 2.97 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. ఆర్8 ఎల్ఎంఎక్స్ మోడల్ కు చెందిన కార్లు 99ని మాత్రమే ఉత్పత్తి చేసింది. ఈ 99లో కేవలం నాలుగింటిని మాత్రమే భారతదేశానికి కేటాయించింది. ఈ నాలుగింటిలో ఒకదానిని కోహ్లీ సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఈ కారుకు విరాట్ మంచి ఛాయిస్ అని 'ఆడి' కంపెనీ పేర్కొంది. భారత్ లో అత్యంత శక్తిమంతమైన, వేగవంతమైన కారు ఇదేనని, ఇది కేవలం 3.4 సెకెన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకోగలదని ఆడి ప్రతినిధి వెల్లడించారు. కాగా, కోహ్లీ దగ్గర ఇంతకు ముందే రెండు ఆడి కార్లు ఉన్నాయి.