: రాణించిన ధోనీ, నేగీ... ముంబై విజయ లక్ష్యం 159

ఐపీఎల్ సీజన్-8లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 158 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఓపెనర్లు బ్రెండన్ మెకల్లమ్ (23), డ్వేన్ స్మిత్ (27) శుభారంభం ఇచ్చారు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరుపై కన్నేసిన చెన్నై ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. పవన్ నేగి (36) మెరుపు ఇన్నింగ్స్ కి కెప్టెన్ ధోనీ (39) బాధ్యతాయుతంగా రాణించడంతో చెన్నై 150 పరుగుల మార్క్ దాటింది. రైనా (10) నిరాశపరచగా, హర్బజన్, వినయ్ కుమార్, మెక్ క్లెనఘన్, సుచిత్ ఒక్కో వికెట్ తో రాణించారు. దీంతో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. 159 పరుగుల విజయ లక్ష్యంతో ముంబై బ్యాటింగ్ ప్రారంభించింది.

More Telugu News