: అమెరికా వైద్యుడిని వెంటాడిన ఎబోలా వైరస్
ఎబోలా వైరస్ ఆ అమెరికా వైద్యుడిని వెంటాడుతోంది. అమెరికా వైద్యుడు లాన్ క్రోజీర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) తో కలిసి ఆఫ్రికాలో ఎబోలా చికిత్స కేంద్రాల్లో సేవలు అందించారు. ఈ క్రమంలో ఆయనకు గతేడాది సెప్టెంబరులో ఈ ప్రమాదకర వైరస్ సోకింది. వెంటనే ఆయనకు మెరుగైన చికిత్స అందించారు. అమెరికాలోని అట్లాంటా ఎమొరీ విశ్వవిద్యాలయం ఆసుపత్రికి చెందిన ఎబోలా యూనిట్ లో చికిత్స పొందిన లాన్ అనంతరం కోలుకున్నారు. అయితే, కొన్ని నెలల క్రితం ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. కన్ను వాచిపోయింది. కంట్లో ఎబోలా వైరస్ ఉందని, తద్వారా కంటి రంగు ఆకుపచ్చగా మారిపోయిందని గుర్తించారు. చికిత్సతో కన్ను మామూలు రంగు సంతరించుకుంటోందని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ పేర్కొంది.