: బీజేపీ కుట్రలకు పాల్పడుతోంది... ఇరు రాష్ట్రాల నాయకులు జాగ్రత్తగా ఉండాలి: సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని సినీ నటుడు శివాజీ అన్నారు. దీనికోసం, రెండు తెలుగు రాష్ట్రాల నాయకులను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో, నాయకులపై కేసులు పెట్టడమో... లేక పాత కేసులను తిరగదోడడమో చేయడం ద్వారా భయపెట్టడానికి కూడా బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. బీజేపీ వలలో నాయకులు పడరాదని... ఆ పార్టీ కుట్రలను గమనించాలని కోరారు. "ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రంలో ప్రవేశించండి... మాకేమీ అభ్యంతరం లేదు" అని శివాజీ అన్నారు. "ఈ జిత్తులమారి రాజకీయాలు అవసరమా? ఎన్ని కోట్ల మంది పిల్లల ఉసురు పోసుకుంటారండీ... మీ రాజకీయాల కోసం?" అంటూ బీజేపీని నిలదీశారు.