: వివాదాస్పద ట్వీట్లపై గాయకుడు అభిజిత్, డిజైనర్ ఫరా క్షమాపణలు
నటుడు సల్మాన్ ఖాన్ కేసు విషయంలో ముంబయి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై వివాదాస్పద ట్వీట్లు చేసిన బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచర్య, డిజైనర్ ఫరా అలీ ఖాన్ లు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు అభిజిత్ మీడియాతో మాట్లాడుతూ, తన వ్యాఖ్యల్లో పరుష పదాలు ఉపయోగించినందుకుగానూ విచారిస్తున్నానని చెప్పారు. సల్మాన్ దృష్టిలో పడేందుకు తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. అటు తన వ్యాఖ్యలపైన విమర్శలు వెల్లువెత్తడంతో ఫరా కూడా క్షమాపణలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు తాను చింతిస్తున్నానని ట్విట్టర్ వేదికగా ఆమె తెలిపారు.