: ఆంధ్రాలోకి రావాలంటే మావోయిస్టులు భయపడుతున్నారు: డీజీపీ రాముడు
ఆంధ్రాలోకి ప్రవేశించడానికి మవోయిస్టులు భయపడుతున్నారని ఏపీ డీజపీ జేవీ రాముడు చెప్పారు. అయితే పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిసిన తరువాత మావోల కార్యకలాపాలు పెరిగాయని వెల్లడించారు. ఇన్ ఫార్మర్ల పేరుతో అమాయక గిరిజనులను మావోలు హతమారుస్తున్నారని కాకినాడలో చెప్పారు. వారి కార్యకలాపాలను ఎలాగైనా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఇంతవరకు 4,500 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నామని డీజీపీ అన్నారు. స్మగ్లర్లపై ఇంతకాలం అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారని, ఇప్పుడు పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.