: సల్మాన్ ను ప్రశంసించిన శివసేన పత్రిక 'సామ్నా'
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై శివసేన పార్టీకి చెందిన సామ్నా పత్రిక ప్రశంసల జల్లు కురిపించింది. కృష్ణ జింకల కేసులో జోథ్ పూర్ కోర్టుకు సల్మాన్ తాను తొలుత భారతీయుడినని చెప్పడాన్ని సామ్నా కొనియాడింది. కోర్టు కుల, మతపరమైన గుర్తింపును అడగ్గా, సల్మాన్ తాను మొదటిగాను, చివరిగాను కూడా భారతీయుడినని; తన తండ్రి ముస్లిం, తల్లి హిందూ కాబట్టి, తాను రెండు మతాలకు చెందిన వాడినవుతానని తెలిపారని సామ్నా కార్యనిర్వాహక సంపాదకుడు సంజయ్ రౌత్ తన వ్యాసంలో పేర్కొన్నారు. జోథ్ పూర్ న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు సల్మాన్ సరైన సమాధానం ఇవ్వకపోయినా, భారతీయుడినని గట్టిగా చెప్పాడని, అందుకు అతడిని అభినందిస్తున్నామని రౌత్ పేర్కొన్నారు.