: నేపాల్ లో మరో రెండుసార్లు కంపించిన భూమి

భారీ భూకంపంతో వణికిపోయిన నేపాల్ లో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 8 వేలకు చేరింది. ఈ క్రమంలో, ఈ ఉదయం నేపాల్ లో మరో రెండుసార్లు భూమి కంపించింది. రాత్రి రెండున్నర గంటల సమయంలో తొలిసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదయింది. అనంతరం ఉదయం ఆరున్నర గంటల సమయంలో 5 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఈ ప్రకంపనలతో నేపాలీలలో భయాందోళనలు మరింత పెరిగాయి.

More Telugu News