: ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలను ప్రభుత్వం గాలికొదిలేసింది: వైకాపా
ఆర్టీసీ కార్మికుల కష్టాలను టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్సార్ టీయూసీ నేత గౌతం రెడ్డి మండిపడ్డారు. కార్మికుల సమస్యపై వేసిన ఉపసంఘం ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు. మంత్రులు శిద్ధా రాఘవరావు, అచ్చెన్నాయుడులు సొంత జిల్లాల్లో తిరుగుతుంటే... మరో మంత్రి యనమల ఢిల్లీలో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంతో కీలకమైన సమస్య రాష్ట్రంలో నెలకొని ఉంటే... చంద్రబాబు మాత్రం జిల్లాల్లో యాత్రలు చేసుకుంటూ ఉన్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరారు.