: కలవద్దని లేఖలు రాసినా లోకేష్ ను కలిసిన ఒబామా

తెలుగుదేశం పార్టీ యువనేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిశారు. వైట్ హౌస్ లోని ఆయన నివాసానికి వెళ్లిన లోకేష్ ను ఒబామా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ సిటీల ప్రాజెక్టుపై ఒబామాకు లోకేష్ వివరించినట్టు తెదేపా మీడియా కమిటీ చైర్మన్ ప్రసాద్ వివరించారు. అమెరికన్ కంపెనీల ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి లోకేష్ ఆయనకు వివరించారట. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు ఈ సందర్భంగా ఒబామా తెలిపారట. కాగా, లోకేష్ ను కలవరాదని అమెరికాలోని కొన్ని తెలుగు సంఘాలు ఒబామాకు లేఖను రాసినప్పటికీ, ఈ యువనేతను కలిసేందుకే ఆయన మొగ్గుచూపడం విశేషం.

More Telugu News