: ఆ భూకంపం ఎవరెస్టు ఎత్తును కూడా మార్చేసింది

నేపాల్ లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం ఎవరెస్టు ఎత్తును కూడా మార్చేసింది. పెను భూకంపానికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరం ఎత్తు స్వల్పంగా తగ్గి ఉండవచ్చని ఉపగ్రహ సమాచారం ఆధారంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2.5 సెంటీమీటర్ల ఎత్తు తగ్గి ఉండవచ్చని ఉపగ్రహ సమాచార అనాలసిస్ ఆధారంగా గుర్తించారు. లైవ్ సెన్స్ రిపోర్టు ప్రకారం కూడా ఎవరెస్టు ఎత్తు తగ్గి ఉండవచ్చని అన్నారు. యూరోపియన్ ఉపగ్రహం సెంటినెల్-1ఏ సమాచారాన్ని కూడా శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని దానితో క్రోడీకరించనున్నారు. అప్పుడు ఎవరెస్టు ఎత్తు తగ్గిందీ లేనిదీ స్పష్టంగా నిర్ధారించనున్నారు. ప్రస్తుతానికి 2.5 సెంటీమీటర్ల ఎత్తు తగ్గినట్టు భావిస్తున్నారు.

More Telugu News