: గోద్రా ఘటనపై సోషల్ మీడియాలో వ్యాఖ్య...అరెస్టు

సోషల్ మీడియాలో స్వేచ్ఛకు, అభ్యంతరకర వ్యాఖ్యలకు మధ్య తేడాను యువతరం తెలుసుకోలేక ఇబ్బందుల్లో పడుతోంది. తమ వ్యాఖ్యలు ఇతరుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని గుర్తించక ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. గోద్రా ఘటనపై సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన అమిత్ సింహ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిని పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ 295 (ఎ), 153 (ఎ), ఐటీ (ఎఫ్) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అతనిని రిమాండ్ కి పంపామని పోలీసులు తెలిపారు.

More Telugu News