: రాణించిన ధావన్, మోర్గాన్...రాజస్థాన్ లక్ష్యం 202

ఐపీఎల్ సీజన్-8లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సత్తాచాటింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాదు జట్టుకు వార్నర్ (24), ధావన్ (54) శుభారంభం అందించారు. వార్నర్ ఐదో ఓవర్ లో అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్ (20) చక్కని సహకారమందించడంతో హైదరాబాదు భారీ స్కోరు దిశగా సాగింది. ధావన్ కు మోర్గాన్ (63) జతకలవడంతో సన్ రైజర్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. చివర్లో బొపారా (12), నమన్ ఓజా (8) మెరుపులు మెరిపించేందుకు ప్రయత్నించినప్పటికీ, సఫలం కాలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు 201 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో రెండు వికెట్లతో వాట్సన్ రాణించగా, ఫల్కనర్, తంబే అతనికి చక్కని సహకారమందించారు.

More Telugu News