: బీఎండబ్ల్యూ తయారీ కేంద్రంలో సచిన్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెన్నైలోని బీఎండబ్ల్యూ కార్ల తయారీ కేంద్రంలో దర్శనమిచ్చారు. బీఎండబ్ల్యూ నూతనంగా 15 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్టు చెన్నైలోని మహీంద్రా వరల్డ్ సిటీలో సంస్థ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సచిన్ బీఎండబ్ల్యూ కార్ల తయారీ విధానం పరిశీలించారు. ఈ సందర్బంగా సిబ్బందితో మాట్లాడి తన అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సచిన్ వెంట బీఎండబ్ల్యూ ఇండియా గ్రూప్ ప్రెసిడెంట్ ఫిలిప్ వన్ సహర్ కూడా ఉన్నారు. భారత్ లో బీఎండబ్ల్యూ కార్ల తయారీని 50 శాతం పెంచే ఆలోచనలో ఉన్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.