: ఆ అగ్ని ప్రమాదానికి కారణం 'పింకీ' దయ్యమే: భీతిల్లుతున్న ఓ గ్రామం

కారణమేంటో తెలియదుగానీ, ఓ గాజుల వ్యాపారి ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. ఎంతగా అంటే దుస్తులు, డబ్బులు, గాజుల తయారీకి వినియోగించే ముడి వస్తువులు సర్వం బూడిదయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో జరుగగా, ఈ అగ్ని ప్రమాదానికి కారణం పదిహేనేళ్ల క్రితం మరణించిన ఇంటి కోడలు పింకీ అని నమ్ముతూ, వ్యాపారి కుటుంబంతో పాటు గ్రామమంతా భయపడుతోంది. పింకీ తనకు చాలా సార్లు కలలో కనిపించి చంపేస్తానని, సర్వనాశనం చేస్తానని బెదిరించిందని ఆమె అత్తగారు చెబుతోంది. పింకీ మరణం తరువాత ఆమె భర్తకు మరోపెళ్లి చేయగా, ఆమెను కూడా పింకీ పట్టి పీడిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. ఇంటి యజమాని మంత్రగాళ్లను సంప్రదించబట్టే, పింకీ ఆగ్రహంతో ఇల్లును దహించివేసిందన్న వార్తలు ఆ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి.

More Telugu News