: వారి దగ్గర సెల్లూ, గిల్లూ ఏమీ లేవు!
ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్న సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు వద్ద సెల్ ఫోన్లు దొరికినట్టు వచ్చిన వార్తలను జైలు అధికారులు ఖండించారు. అటువంటి ఘటనేదీ జరగలేదని, మీడియాలో వచ్చిన వార్తలు కల్పితమని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వరరెడ్డి వివరించారు. జైలు ఆవరణలో సెల్ ఫోన్లు లభిస్తే తాము వెంటనే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. జైలులో రామలింగరాజు తదితరులకు సెల్ ఫోన్స్ అందుబాటులో లేవని, వారిని ఇతర ఖైదీలతో సమానంగానే చూస్తున్నామని, ఎటువంటి ప్రత్యేక సదుపాయాలనూ కల్పించలేదని ఆయన స్పష్టం చేశారు.