: శివాజీకి జాండీస్...క్షీణించిన ఆరోగ్యం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన సినీ నటుడు శివాజీ అనారోగ్యానికి గురైనట్టు వైద్యులు గుర్తించారు. వేసవి ఎండలో నడి రోడ్డుపై ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న శివాజీ నాలుగురోజుల పాటు దీక్ష కొనసాగించడంతో అనారోగ్యానికి గురయ్యారు. వైద్యపరీక్షల్లో పచ్చకామెర్లు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు, చికిత్సకు అంగీకరించాలని కోరారు. అయినప్పటికీ శివాజీ నిరాకరించడంతో నేటి సాయంత్రం వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆయనకు జాండీస్ ముదిరినట్టు గుర్తించి, బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. దీంతో శివాజీ ఆమరణ నిరాహార దీక్ష ముగిసినట్టు తెలుస్తోంది.

More Telugu News