: రాజీనామాను 'వాట్స్ యాప్' లో పంపిన ఎస్సై
ఉత్తరప్రదేశ్ లో ఓ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ తన రాజీనామాను వాట్స్ యాప్ లో పంపడం విశేషం. ప్రజల సమస్యలు నివేదించడానికి ఉద్దేశించిన 'వాట్స్ యాప్' నంబర్ కు ఈ ఎస్సై తన రాజీనామాను పంపారు. సీనియర్ అధికారులు తనను అవమానిస్తున్నారని, వేధిస్తున్నారని రసూలాబాద్ ఎస్సై వినోద్ కుమార్ ఆరోపిస్తూ 'వాట్స్ యాప్' లో తన రాజీనామాను పంపినట్టు కాన్పూర్ జోన్ ఐజీ పీఆర్వో వెల్లడించారు. దీనిపై కాన్పూర్ ఎస్పీని విచారణకు ఆదేశించినట్టు ఐజీ అశుతోష్ పాండే తెలిపారు. నివేదిక అందిన పిమ్మట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓ పోలీస్ అధికారి ఈ తరహాలో రాజీనామా పంపడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.