: అది కేవలం ప్రమాదమే... పైకోర్టు ఉందిగా: సల్మాన్ కు చిరంజీవి ఊరట

తన వాహనాన్ని రోడ్డు పక్కన నిద్రిస్తున్నవారి పైకి ఎక్కించి ఒకరి మృతికి కారణమైన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ఉద్దేశించి ప్రముఖ నటుడు చిరంజీవి ఊరడింపు వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ దోషిగా తేలడంపై ఆయన స్పందన కోరగా "ఇది కేవలం ఒక ప్రమాదమే. చెయ్యాలని చేసింది కాదు. నా తోటి కళాకారుడు సల్మాన్ దోషిగా తేలడంపై నాకూ చాలా బాధగా వుంది. ఆయనకు పైకోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. కచ్ఛితంగా ఆయనకు శిక్ష వేసే సమయంలో న్యాయమూర్తి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారనే భావిస్తున్నా" అన్నారు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న పలు చిత్రాలను పూర్తి చేసే అవకాశం ఆయనకు లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News