: మీరెంత చెబితే అంత నష్టపరిహారం ఇస్తాం... కనికరించండి: న్యాయమూర్తిని వేడుకున్న సల్మాన్ న్యాయవాది

తన క్లయింటు సల్మాన్ ఖాన్ ఎంతో ఉదారవాదని, ఇప్పటికే 600 మంది చిన్నారుల గుండెలకు శస్త్రచికిత్సలు చేసేందుకు సహాయం చేసున్నాడని చెబుతూ, రెండేళ్లకు మించి శిక్షను విధించవద్దని ఆయన తరపు న్యాయవాది జడ్జికి విజ్ఞప్తి చేశారు. "మీరు ఎంత నష్టపరిహారాన్ని బాధితులకు ఇవ్వమని ఆదేశిస్తే, అంత చెల్లించేందుకు మా క్లయింటు సిద్ధంగా ఉన్నారు. ఆయన చాలా మంచి పనులు చేశారు. దయచేసి కనికరించండి" అని ఆయన శిక్షపై తుది వాదన వినిపిస్తూ వేడుకున్నారు. గతంలో రహదారి ప్రమాదాల కేసుల్లో సుప్రీంకోర్టు ఎన్నడూ మూడేళ్లకు మించి శిక్షలు విధించలేదని ఆయన గుర్తు చేశారు.

More Telugu News