: కేసీఆర్ ప్రభుత్వంపై మరో కేసు... ఎన్టీఆర్ స్టేడియంను కొత్త నిర్మాణాలకు ఇవ్వడంపై సవాల్
కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టులో మరో పిల్ వేశారు. హైదరాబాదులోని ఇందిరాపార్క్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం స్థలాన్ని కళాభారతి పేరుతో కొత్త నిర్మాణాలకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ, ఇందిరాపార్క్ పాదచారుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. ఎన్టీఆర్ స్టేడియం ఇక్కడి ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతోందని, పిల్లలు కూడా పలు రకాల ఆటలు ఆడుకుంటూ ఉంటారని... ఈ స్థలాన్ని ఇతర నిర్మాణాలకు ఇస్తే ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. కళల కోసం రవీంద్రభారతితో పాటు పలు సంస్థలు ఉండగా, పిల్లలు ఆడుకునే స్థలం ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు.