: పందెం కట్టిన కంబోడియా ప్రధాని ప్లేటు ఫిరాయించాడు!

మేవెదర్, పకియావ్ ల మధ్య మొన్న జరిగిన 'బిగ్ ఫైట్' లో పకియావ్ గెలుస్తాడని 5 వేల డాలర్లు పందెం కట్టిన కంబోడియా ప్రధాని హున్ సేన్ ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేది లేదని ప్లేటు ఫిరాయించాడట. అమెరికన్ జడ్జీలు, తమ దేశవాసిగా బరిలోకి దిగిన మేవెదర్ ను గెలిపించేందుకు ఏకతాటిపై నిలిచారని హున్ సేన్ ఆరోపిస్తున్నారు. జడ్జీల పక్షపాతం కారణంగానే మేవెదర్ గెలిచాడని, పకియావ్ పంచ్ ల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే మేవెదర్ యత్నించాడని ఆరోపించారు. ఓడిపోవాల్సిన వ్యక్తిని దగ్గరుండి ఏకగ్రీవంగా గెలిపించిన అమెరికా అంటే ఏంటో తనకిప్పుడే తెలిసిందని, అందువల్ల తాను కాసిన పందెం డబ్బులు చెల్లించబోనని అంటున్నారు.

More Telugu News