: సాధారణ పరీక్షల కోసమే ఆసుపత్రికి... మణిరత్నంకు ఛాతీనొప్పి రాలేదు: నిర్మాత మాల మన్యన్
ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు ఛాతినొప్పి వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాల మన్యన్ వివరించారు. మణిరత్నం సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారని స్పష్టం చేశారు. ఆయనకు ఛాతినొప్పి వచ్చిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఈ రోజు ఉదయం వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం మణిరత్నం, ఆయన భార్య సుహాసిని ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నారని, చెన్నైలో అయితే అందరి దృష్టికి వెళ్లి పుకార్లు వస్తాయనే ఉద్దేశ్యంతోనే ఢిల్లీలో పరీక్షలు చేయించుకున్నారని మన్యన్ వివరించారు.