: ఐఎస్ఐఎస్ లో చేరిన హైదరాబాదీ మృతి

మత మౌఢ్యం కారణంగా తప్పుదోవపట్టిన హైదరాబాదీ యువకుడు సిరియాలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దీనిని ఇంటెలిజెన్స్ వర్గాలు అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశాయి. హనీఫ్ సమాచారాన్ని తెలుసుకునేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. హైదరాబాదులో డిగ్రీ చదువుకున్న హనీఫ్ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేందుకు లండన్ వెళ్లాడు. అక్కడ ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడై లండన్ నుంచి సిరియా వెళ్లి ఐఎస్ఐఎస్ లో చేరాడు. సిరియాలో జరిగిన దాడుల్లో హనీఫ్ మృతి చెందినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

More Telugu News