: విజయశాంతి మాదిరి అయిపోతారు: తుమ్మల, తలసానిపై రేవంత్ రెడ్డి విసుర్లు

అన్నం పెట్టిన తెలుగుదేశం పార్టీని వదిలేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లపై రేవంత్ మరోసారి మండిపడ్డారు. వీరిద్దరికీ గతంలో విజయశాంతికి పట్టిన గతే పడుతుందని ఆయన జ్యోస్యం చెప్పారు. ఈ మధ్యాహ్నం ఆయన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాజీనామా ఆమోదించుకోలేని తలసానికి తనను విమర్శించే అర్హత లేదని అన్నారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలు రద్దు చేస్తూ, హైకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణం అమలు చేయాలని సీఎస్ ను కోరినట్టు రేవంత్ వివరించారు.

More Telugu News