: శివాజీ దీక్షకు వైసీపీ మద్దతు... అందరూ అండగా నిలవాలన్న జోగి రమేశ్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం సినీ నటుడు, బీజేపీ నేత శివాజీ చేస్తున్న ఆమరణ దీక్షకు ప్రతిపక్ష వైసీపీ మద్దతు పలికింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన సందర్భంగా ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్, శివాజీ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. న్యాయమైన డిమాండ్ కోసం పోరాడుతున్న శివాజీకి అన్ని వర్గాల వారు మద్దతు తెలపాలని రమేశ్ పిలుపునిచ్చారు. బీజేపీ నేతగా ఉన్న శివాజీ ఏపీ ప్రజల తరఫున సొంత పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన పేర్కొన్నారు.