: కేసీఆర్ ఆదేశాలు పాటించండి... 20 ఏళ్లు అధికారం మనదే: కవిత

మూడు రోజుల పాటు నాగార్జున సాగర్ లో జరిగిన టీఆర్ఎస్ శిక్షణా తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ, పార్టీ భవిష్యత్తు ప్రణాళిక గురించి అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. కేసీఆర్ సూచనలు, ఆదేశాలు పాటిస్తే మరో 20 ఏళ్ల వరకు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి అన్ని రంగాలపై చర్చ జరిగిందని, మొత్తం కార్యక్రమం అద్భుతంగా సాగిందని కవిత అన్నారు. శిక్షణా తరగతుల వల్ల నేతలకు అనేక అంశాలపై అవగాహన పెరిగిందని చెప్పారు.

More Telugu News