: క్రీడాలోకాన్ని మళ్లీ విషాదం ముంచెత్తింది... గుండెపోటుతో రగ్బీ ఆటగాడు మృతి

ఇటీవల కాలంలో క్రీడాకారులు హఠాన్మరణం పాలవుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఫిల్ హ్యూస్, అంకిత్ కేసరి వంటి క్రికెటర్లు ఆటలో తగిలిన దెబ్బలతో ప్రాణాలు విడవడం తెలిసిందే. తాజాగా, లండన్ లోని ద వేల్స్ ఇంటర్నేషనల్ రగ్బీ చాంపియన్ షిప్ లో విషాదం చోటు చేసుకుంది. కెయిలీ కోగార్స్ జట్టు ఆటగాడు డేనీ జోన్స్ (29) గుండెపోటుతో మరణించాడు. ఆదివారం మ్యాచ్ జరుగుతుండగా, జోన్స్ మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో, అతడికి ప్రాథమిక చికిత్స నిర్వహించి, వెంటనే రాయల్ ఫ్రీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జోన్స్ తుదిశ్వాస విడిచాడు. అతడి మృతితో బ్రిటన్ రగ్బీ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి.

More Telugu News