: పంతం నెగ్గించుకున్న పరిటాల... ‘రాప్తాడు’ పోలీసులకు పోస్టింగులు, గన్ మెన్ల స్వీకరణ
ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పంతం నెగ్గించుకున్నారు. రాప్తాడు వైసీపీ మాజీ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి హత్యానంతరం సీఐ, ఎస్సైలను విధుల నుంచి తప్పించి వీఆర్ కు పంపిన ప్రభుత్వ చర్యపై పరిటాల మొన్న భగ్గుమన్నారు. అనంతపురం ఎస్పీ రాజశేఖరబాబుతో ఆమె వాగ్వాదానికి దిగినా ఫలితం లేకపోయింది. దీంతో తన భద్రత కోసం కేటాయించిన గన్ మెన్లను తిప్పి పంపి, పోలీసుల నిర్ణయంపై తన నిరసన వ్యక్తం చేశారు. అయితే పరిటాలను శాంతపరిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీఆర్ కు పంపిన ఇద్దరు పోలీసు అధికారులకు పోస్టింగ్ లు ఇస్తూ నిన్న డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శాంతించిన పరిటాల సునీత తాను తిప్పి పంపిన గన్ మెన్లను తిరిగి రప్పించుకున్నారు.