: ఓ కుటుంబాన్నే అంతం చేసిన చిన్న గొడవ!
భార్యా భర్తల మధ్య జరిగిన చిన్న వివాదం. నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ సమీపంలోని బార్మర్ అనే గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనిల్, చున్నీ దేవి దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తన ఒకటిన్నర సంవత్సరం వయసున్న కొడుకు లలిత్, ఆరు నెలల వయసున్న కూతురు గాయత్రి సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గమనించిన భర్త అనిల్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వివరించారు.