: గేల్, కోహ్లీ, మన్ దీప్ సింగ్ బాదేశారు
ఐపీఎల్-8లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్ కతా నిర్దేశించిన 112 పరుగుల లక్ష్యాన్ని ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు ఛేదించింది. క్రిస్ గేల్ (21), విరాట్ కోహ్లీ (34) దూకుడుగా ఆడడంతో డివిలియర్స్ (2) నిరాశపరిచినప్పటికీ, మన్ దీప్ సింగ్ (45) వీరవిహారం చేసి బెంగళూరును విజయతీరాలకు చేర్చాడు. వర్షం కారణంగా, పది ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో ఓవర్ కు 11 చొప్పున కోల్ కతా ఆటగాళ్లు బాదారు. అయినప్పటికీ బెంగళూరు విజయం సాధించడం విశేషం.