: ఓవర్ కి 11 చొప్పున బాదేశారు

ఐపీఎల్ -8లో భాగంగా నేడు జరగాల్సిన మ్యాచ్ ను వరుణుడు అడ్డుకున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే ప్రారంభమైన వర్షం చాలా సేపటి వరకు వదల్లేదు. దీంతో మ్యాచ్ ను 10 ఓవర్లకు కుదించారు. ఇరు జట్లకు స్ట్రాటెజిక్ సమయం ఇవ్వలేదు. ఇన్నింగ్స్ మధ్య విరామ సమయం కేవలం 10 నిమిషాలు మాత్రమేనని స్పష్టం చేశారు. పది ఓవర్ల మ్యాచ్ కావడంతో ఒక్కో బౌలర్ గరిష్టంగా రెండు ఓవర్లు వేయవచ్చని నిర్ణయించారు. ఫీల్డ్ లిమిట్ తొలి మూడు ఓవర్లు మాత్రమే ఉంటుందని వెల్లడించారు. దీంతో, టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి, 111 పరుగులు సాధించింది. ఓవర్ కి 11 పరుగుల చొప్పున బాదడంతో భారీ స్కోరు నమోదైంది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (23), గౌతం గంభీర్ (12) అంతగా ఆకట్టుకోనప్పటికీ ఆండ్రీ రస్సెల్ (45) వచ్చిన బంతిని వచ్చినట్టే బౌండరీ దాటించాడు. దీంతో కోల్ కతా జట్టు బెంగళూరుకు 112 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు బౌలర్లలో చాహల్, డేవిడ్ వీసే, స్టార్క్ తలో వికెట్ తీశారు.

More Telugu News