: తిరుమల మెట్ల మార్గంలో పరుగులు తీసిన భక్తులు

పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలకు వెళ్లే మెట్ల మార్గంలో ఈ రోజు కలకలం చెలరేగింది. మార్గంలోని 153వ మెట్టు దగ్గర రెండు చిరుతలు సంచరించాయి. వీటిని చూసిన భక్తులు పరుగులు పెట్టారు. విషయం తెలిసిన అటవీ అధికారులు వెంటనే ఆ స్థలానికి చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలను ఆపేశారు. చిరుతలు లేవన్న విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత భక్తుల రాకపోకలను మళ్లీ పునరుద్ధరిస్తారు. వేసవి కావడంతో మంచినీటి కోసం అడవిలోని జంతువులు బయటకు వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.

More Telugu News