: తలసానీ! నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు: సినీ నటి కవిత
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సినీ నటి, టీడీపీ మహిళా నేత కవిత హెచ్చరించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, తలసాని టీఆర్ఎస్ లోకి రాకముందు ఎవరింటి చుట్టూ తిరిగేవారని ఆమె ప్రశ్నించారు. తలసాని చంద్రబాబుపై విమర్శలు చేయడానికి ముందు, ఆయన కాళ్లు పట్టుకుని సంపాదించిన ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళ్లి అప్పుడు మాట్లాడాలని ఆమె సూచించారు. చంద్రబాబుపై విమర్శలు చేసి తమ స్థాయిని పెంచుకుందామని టీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.