: అక్కడెలా దిగుతారు?: అమెరికాను ప్రశ్నించిన చైనా
తైవాన్ లో అమెరికా జెట్ ఫైటర్స్ దిగడం పట్ల చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 'మా భూభాగంలో మీరెలా దిగుతా'రంటూ అమెరికాను చైనా ప్రశ్నించింది. తైవాన్ లో అమెరికాకు చెందిన రెండు జెట్ ఫైటర్స్ అత్యవసరంగా ల్యాండయ్యాయి. అయితే అనుమతి లేకుండా, అత్యవసరం అంటూ తైవాన్ లో దిగడం సరికాదంటూ చైనా మండిపడుతోంది. కాగా జెట్ ఫైటర్ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా తైవాన్ దక్షిణ ప్రాంతంలో ఉన్న ఎయిర్ బేస్ లో అమెరికా జెట్ ఫైటర్స్ దిగినట్టు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో చైనా విమానాశ్రయం నిర్మిస్తోందని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా బయటపెట్టిన అమెరికా, తన జెట్ ఫైటర్స్ ను తైవాన్ లో దింపడం వ్యూహాత్మక ఎత్తుగడగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, తైవాన్ తమ భూభాగంలో ఉందని చైనా వాదిస్తోంది.