: అనంత జిల్లాలో 70 మంది వైకాపా కార్యకర్తల అరెస్ట్

అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా నేత ప్రసాద్ రెడ్డి దారుణ హత్య అనంతరం... ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పోలీసులపై రాళ్లు రువ్వడమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలపై విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో, విధ్వంసానికి పాల్పడ్డ 70 మంది వైకాపా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న ఆత్మకూరు, కనగానపల్లె, ఇటుకలపల్లె పోలీస్ స్టేషన్లకు తరలించారు. విధ్వంసానికి పాల్పడ్డ వైకాపా కార్యకర్తల కోసం గత రాత్రి నుంచి పోలీసులు సోదాలు నిర్వహించారు.

More Telugu News