: నారా లోకేశ్ ప్రైవేట్ టూర్ లో ప్రభుత్వ అధికారులు... ఖర్చు కూడా సర్కారుదేనట!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేశ్ రేపు అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం జరుపుతున్న ఈ పర్యటనలో ఆయన అమెరికా పారిశ్రామికవేత్తలతో పాటు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోనూ భేటీ కానున్నారు. దాదాపు 10 రోజుల పాటు పర్యటించే ఆయన ఈ నెల 12న పర్యటన ముగించుకుని తిరుగు పయనమవుతారు. ఈ పర్యటన పూర్తిగా ప్రైవేట్ పర్యటనేనని లోకేశ్ సన్నిహితులు చెబుతున్నారు.
అయితే అమెరికా పర్యటనలో లోకేశ్ వెంట ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు వెళుతున్నారు. వారిలో ఒకరు పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా కాగా, మరొకరు సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న అభీష్ట. వీరిద్దరి పర్యటన ఖర్చులు ప్రభుత్వమే భరిస్తోందట. లోకేశ్ వెంట వీరిద్దరినీ పంపాలని సాక్షాత్తు సీఎం చంద్రబాబునాయుడే సిఫారసు చేశారట. సీఎం సిఫారసు మేరకు సాధారణ పరిపాలన శాఖ నిన్న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.