: నేడు ఎమ్మిగనూరులో లెజెండ్ 400వ రోజు వేడుక...హాజరుకానున్న చంద్రబాబు, బాలయ్య

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణలు నేడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. బాలకృష్ణ నటించిన హిట్ మూవీ 'లెజెండ్' ఎమ్మిగనూరులో నేడు 400వ రోజు ప్రదర్శనను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా బాలయ్య అభిమానులు పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో భారీ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాలయ్యతో పాటు చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. నేటి మధ్యాహ్నం ఎమ్మిగనూరు వెళ్లనున్న చంద్రబాబు అక్కడ నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత బాలయ్యతో కలిసి లెజెండ్ చిత్ర విజయోత్సవంలో పాలుపంచుకుంటారు. చంద్రబాబుతో పాటు బాలయ్య కూడా రానుండటంతో ఎమ్మిగనూరులో కోలాహలం నెలకొంది. నేతలిద్దరి రాక కోసం ఎమ్మిగనూరు వాసులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు.

More Telugu News