: వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం జిల్లా సీఐ, ఎస్ఐలపై చర్యలు
అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇటుకలపల్లి సీఐ శ్రీనివాస్, రాప్తాడు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ లను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసాదరెడ్డి హత్య నేపథ్యంలో ఆ ఇద్దరి పోలీసుల తీరుపై విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. మూడు రోజుల కిందట రాప్తాడులో ప్రసాదరెడ్డిని కొందరు వేటకొడవళ్లతో నరికిచంపిన విషయం విదితమే.